బజరత్నూర్,(ఆరోగ్యజ్యోతి) :త్వరలో బజరత్నూర్ మండలానికి 108 అంబులెన్స్ ఏర్పాటు ఎలా చూస్తాం అని ఎంపీ సోయం బాపురావు హామీ ఇచ్చారు. శుక్రవారంనాడు ఎంపీడీవో కార్యాలయంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు జయశ్రీ అధ్యక్షతన ఏర్పాటుచేసిన సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతితిగా హాజరై మాట్లాడుతూ అంబులెన్స్ సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ఈ సర్వసభ్య సమావేశం కార్యక్రమంలో జెడ్పిటిసి మల్లెపూల నర్సయ్య, పోరెడ్డి శ్రీనివాస్, ఎంపీడీవో దుర్గం శంకర్, తహసిల్దార్ జాకీర్ ,ఆయా శాఖల అధికారులు సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు