పేదవాడిగా పుట్టడం నేను చేసిన తప్పు

 - గర్భిణీకి ట్రీట్ మెంట్ కు నిరాకరించిన డాక్టర్లు


 - కవలలు, గర్భిణి మృతి


ఉత్తరాఖండ్ కు చెందిన సుధాసైనీ, కమేలేష్ లు భార్యభర్తలు. అయితే కమలేష్ భార్య 7నెలల గర్భవతి. ఓ సమయంలో పురిటి రావడంతో  అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కానీ గర్భిణీ జ్వరంతో బాధపడుతుందని, కరోనా సోకిందేమోనన్న అనుమానంతో ట్రీట్ మెంట్ ఇచ్చేందుకు డాక్టర్లు నిరాకరించారు. దీంతో సుధాసైని ఇద్దరు కవలపిల్లలకు జన్మనిచ్చింది. డాక్టర్లు ట్రీట్ మెంట్ ఇవ్వకపోవడంతో ట్విన్స్ పుట్టిన కొద్దిసేపటికే మరణించారు. తన భార్యను కాపాడుకొనేందుకు కమలేష్ తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యాడు. జ్వరంతో బాధపడుతున్న సుధాసైనీకి ట్రీట్ మెంట్ ఇచ్చేందుకు ఐదుఆస్పత్రులకు చెందిన డాక్టర్లు ట్రీట్ మెంట్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆమె మరణించింది.తన భార్యను ఆస్పత్రిలో జాయిన్ చేయించుకోవాలంటూ ఎమ్మెల్యే హర్భజన్స్ కపూర్ తో సంప్రదింపులు జరిపామని..కానీ ఆస్పత్రి వైద్యులు చేర్పించుకోలేదని కమలేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా సీఎంఓ అధికారులు మాట్లాడుతూ తాము కమలేష్ భార్యకు ట్రీట్ మెంట్ చేయాలని చీఫ్ మెడికల్ ఆఫీసర్ కు ఆదేశించామన్నారు. కానీ బాధితురాలు ట్రీట్ మెంట్ తీసుకునేందుకు నిరాకరించిందన్నారు. డాక్టర్లు ట్రీట్ మెంట్ చేస్తానంటే తన భార్య ట్రీట్ మెంట్ చేయించుకునేందుకు ఎలా నిరాకరిస్తుందంటూ కమేలేష్ ప్రశ్నిస్తున్నాడు.