హైదరాబాద్ : తెలంగాణలోని నల్గండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిట్యాల శివారులో ఉన్న రిలయన్స్ పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డు పక్కన నిలిపివున్న ధాన్యం లారీని కారు వెనకనుండి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి నుండి కారు హైదరాబాద్ వెళుతోంది. మృతి చెందిన ముగ్గురు రాజమండ్రి దగ్గర కొత్తపల్లి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు క్షేమంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో కారులో మొత్తం ఎనిమిది మంది ఉన్నారని అన్నారు.