హైదరాబాద్: స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 29వ వర్ధంతి సందర్బంగా సోమాజీగూడలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంత రావు, గూడూరు నారాయణ రెడ్డి, బొల్లు కిషన్ తదితరులు పాల్గొన్నారు.