చెన్నై: తమిళనాడులో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కోయంబేడు లింకులతో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నది.శుక్రవారం 786 మందికి కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించగా.. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా కేసుల సంఖ్య 14, 753కు చేరింది. ఇప్పటివరకు వైరస్ బారిన పడి తమిళనాడులో 98 మంది మృతి చెందినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. చెన్నైలో మాత్రం ఈరోజు కొత్తగా 567 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో.. మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 9,364కి చేరింది.