మెదక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

మెదక్: జిల్లాలోని అల్లాదుర్గం మండలం రాంపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని ట్రాక్టర్ ఢీకొనడంతో మొండం నుంచి తల తెడిపడి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు శంకరంపేట మండలం ఉత్తులూర్ గ్రామానికి చెందిన మున్నూరు దుర్గయ్యగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.