ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన ప్రతి ఒక్కరూ పదవీ విరమణ చేయడం సహజమని,చందు సేవలు కొనియదలేనివి జిల్లా కలెక్టర్ శ్రిదేవసేన అన్నారు.ఆదివారంనాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చందు పదవీ విరమణ చేసిన సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన సమావేశానికి ఆమె ముఖ్య అతిదిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి విరమణ అనేది సహజం అని తెలిపారు. ఉద్యోగరీత్యా చేరడం తర్వాత అంచెలంచెలుగా పదోన్నతులు పొంది ఉండటం తర్వాత పదవి విరమణ పొందటం లాంటివి ప్రతి ఒక్కరికి జరిగేవి అన్నారు . పదవీ విరమణ పొందడం కొన్ని సందర్భాల్లో బాధ అనిపించినా ప్రతి ఉద్యోగి విరమణ అనేది తప్పదని తెలిపారు.ఈ కార్యక్రమంలో నూతన గా నియమించబడిన ఆదిలాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాథోడ్ నరేందర్ , నిర్మల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్డా వసంతరావు ,జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శ్రీకాంత్,తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డాక్టర్స్ శ్రీధర్. డాక్టర్ వై సి శ్రీనివాస్, డాక్టర్ స మంత్, తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సంఘం జిల్లా అధ్యక్షులు బండారి కృష్ణ తదితరులు పాల్గొన్నారు
సన్మానాలు
అనంతరం ట్రైబల్ అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్. పదవి విరమణ పొందిన డాక్టర్ చందు కు శాలువాతో సన్మానించారు. అలాగే డిప్యూటి డీఎంహెచ్ఓ డాక్టర్ సాధన కూడా శాలువాతో సన్మానించారు. అనంతరం తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పదవి విరమణ పొందిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కి శాలువాతో జిల్లా లోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చెందిన వైద్య అధికారులు సన్మానించారు. అనంతరంతెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సంఘం జిల్లా అధ్యక్షులు బండారి కృష్ణ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఎన్ ఆర్ ఎహ్ ఎం సిబ్బంది, ఫార్మసిస్ట్ సంఘం మరియు ల్యాబ్ టెక్నీషియన్ సంఘం ఎల్ డి సి ,యు డి సి సంఘాల తో పాటు జిల్లాలోని వివిధ మెడికల్ పార మెడికల్ వివిధ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో సన్మానం చేశారు.