గాంధీ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగికి కరోనా

 


అడ్డగుట్ట, (ఆరోగ్యజ్యోతి): గాంధీ ఆస్పత్రిలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగికి (28) కరోనా పాజిటివ్‌ వచ్చింది. కొన్నేళ్లుగా ఆస్పత్రిలో పనిచేస్తున్న అతడు కొద్దిరోజులుగా.. కొవిడ్‌-19తో చనిపోయినవారి మృతదేహాలను మూట కట్టే పనిలో ఉన్నాడు. రెండు రోజులుగా అనారోగ్యంతో ఉండడంతో బుధవారంనాడు వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. అతడికి వైరస్‌ సోకినట్టు వైద్యులు వెల్లడించారు.