పేదల ప్రాథమిక ఆరోగ్యానికి బస్తీ దవాఖానాలే అండ: కేటీఆర్‌

హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): పేదల ప్రాథమిక ఆరోగ్యానికి బస్తీ దవాఖానాలే అండ అని కేటీఆర్‌ చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బస్తీ దవాఖనాలకు ప్రజల నుంచి మంచి స్పందన ఉందని, స్థానికంగా పేద ప్రజలకు అవసరమైన రక్త పరీక్షలు చేస్తారని కేటీఆర్‌ తెలిపారు. గ్రేటర్‌లోని పలు ప్రాంతాల్లో సిద్ధం చేసిన 45 బస్తీ దవాఖానాలను మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డిలు స్థానిక ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో కలిసి నేడు ప్రారంభించిన విషయం తెలిసిందే. నిరుపేదలు నివసించే బస్తీల్లోనే ఈ దవాఖానాల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ఐదు నుంచి పది వేల మందికి ఒకటి చొప్పున డివిజన్‌కు కనీసం రెండు దవాఖానాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.