నేలకొండపల్లి(ముదిగొండ), : ఇంటింటి ఆరోగ్యసర్వే సమగ్రంగా చేపట్టాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. నేలకొండపల్లిలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యాపారి నివాసప్రాంతాన్ని శనివారం కలెక్టర్ సందర్శించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. దగ్గు, జ్వరం, జలుబుతో బాధపడేవారుంటే వారిని పరీక్షల కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాలని సూచించారు. ఇంటింటి సర్వేకు టీమ్‌లు వేశారా? అని అధికారులను ప్రశ్నించారు. 10టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు వైద్యాధికారి రాజేశ్ తెలిపారు. నేలకొండపల్లిలో ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి పర్యటించారు. ప్రజలు మాస్కులు ధరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రవీంద్రనాథ్, తహసీల్దార్ వీరభద్రం, ఎంపీీడీవో రవికుమార్, వైద్యాధికారులు రాజేశ్, సురేశ్‌నారాయణ, మురళి, సర్పంచి నవీన్ పాల్గొన్నారు. నేలకొండపల్లిలోని ఓ వ్యాపారికి కరోనా సోకడంతో వైద్యసిబ్బంది కరోనా పాజిటివ్ వచ్చిన వ్యాపారి నివాసం ఉండే వీధిలో శనివారం ఇంటింటి సర్వే నిర్వహించారు. నేలకొండపల్లి లాక్‌డౌన్ పాటించారు. దుకాణాలు అన్ని మూసివేశారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలతో 10టీమ్‌లు ఏర్పాటు చేసి ఇంటింటి సర్వే నిర్వహించారు. జలుబు, దగ్గు, జ్వరంతో ఎవరైనా బాధపడుతున్నారా? అని వివరాలను సేకరించారు. నేలకొండపల్లి పంచాయతీ సిబ్బంది గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. కరోనా పాజిటివ్ సోకిన వ్యాపారి నివాస ప్రాంతాన్ని డీటీసీీవో సుబ్బారావు పరిశీలించారు.