కోల్ కతా: పశ్చిమబెంగాల్ లో అంఫాన్ తుఫాను ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో ప్రధాని నరేంద్రమోదీ ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. తుఫాను ధాటికి దెబ్బతిన్న ప్రాంతాల్లో కలియతిరుగుతూ ఏరియల్ సర్వే చేపట్టారు. అంఫాన్ వల్ల జరిగిన నష్టంపై ప్రధాని మోదీ ఏరియల్ సర్వే, సమీక్షల ద్వారా ఓ అంచనాకు రానున్నారు.ప్రధాని మోదీ వెంట సీఎం మమతాబెనర్జీ ఉన్నారు. అంఫాన్ విలయ తాండవానికి ఇప్పటివరకు బెంగాల్ లో 80 మంది మృతి చెందారు. ఒడిశాలో ఇద్దరు మృతి చెందారు. 44.8 లక్షల మంది ప్రభావితమయ్యారు. బంగ్లాదేశ్ లో 10 మంది మృతి చెందారు.