హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చేందుకు వీలుగా రేపట్నుంచి హైదరాబాద్‌లో ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. ఈ మేరకు ప్రత్యేక బస్సుల సౌకర్యంపై టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి స్పందిస్తూ... ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చేందుకు వీలుగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రత్యేక బస్సుల ఏర్పాటుకు అనుమతించినందుకు సీఎంకు కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. నగరంలోని వివిధ చోట్ల నుంచి కార్యాలయాలకు వచ్చేవారికి బస్సు సౌకర్యం కల్పించామన్నారు. ఉద్యోగులు గుర్తింపు కార్డులు చూపి బస్సులోకి ఎక్కాల్సిందిగా సూచించారు. నగరంలోని మొత్తం 32 మార్గాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు బస్సు సౌకర్యం ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.