అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు మే నెల వేతనాలను పూర్తిగా చెల్లించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గురువారం ఆర్థిక శాఖ అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. కరోనా కారణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో కొంత శాతం జీతాలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే మే నెలకు సంబంధించిన జీతాలపై అధికారులతో సీఎం వైఎస్ జగన్ సమీక్షించి పూర్తి వేతనాలు చెల్లించాలని ఆదేశించారు.