హైదరాబాద్, (ఆరోగ్యజ్యోతి): అన్ని దవాఖానల్లో పూర్తిస్థాయి సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. ఎంతమంది అవసరం అవుతారో నివేదిక రూపొందించి, అవసరమైన ఖాళీలను భర్తీచేయాలని వైద్యాధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో పెరుగుతున్న కరో నా కేసుల సంఖ్యపై శుక్రవారం తన కార్యాలయంలో వైద్యశాఖ ఉన్నతాధికారులతో స మీక్ష నిర్వహించారు. కరోనా వ్యాప్తిపై ప్రజ లు భయాందోళన చెందొద్దని, వైరస్ వ్యాప్తిని సమర్థంగా అడ్డుకొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కాగా, డబ్ల్యుహెచ్‌వో కార్యనిర్వాహక బోర్డు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌తో మంత్రి ఈటల ఫోన్‌లో మాట్లాడి అభినందనలు తెలిపారు. వలస కార్మికుల ద్వారా కరోనా కేసుల సం ఖ్య పెరుగడంపై చర్చించారు. విదేశాల నుం చి వచ్చినవారిని 14 రోజులపాటు హోటల్‌లో ఉంచుతున్నామని చెప్పారు.