- ఆరోగ్య అదిలాబాద్ జిల్లా గా తీర్చిదిద్దాలి
- సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు
- ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు
ఆదిలాబాద్, (ఆరోగ్యజ్యోతి); ఆదిలాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గా డాక్టర్ రాథోడ్ నరేందర్ నియమిస్తున్నట్లు ప్రభుత్వం శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా పనిచేస్తున్న డాక్టర్ తోడాసం చందు పదవి విరమణ పొందారు. ఈయన స్థానంలో డాక్టర్ నరేందర్ ను నియమించారు.ఆదిలాబాద్ జిల్లా కు చెందిన డాక్టర్ నరేందర్ భీంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి గా పని చేయడంతో పాటు, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి లో మత్తుమందు నిపుణులు గా పనిచేశారు. కొంతకాలం జిల్లా మలేరియా అధికారి గా పనిచేశారు.ప్రస్తుతం బోథ్ కమ్యునిటీ హెల్త్ సెంటర్ సుపరిండెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి గా నియమించడం సంతోషకరమన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా గిరిజన గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయని వచ్చే ప్రజలు ఎలాంటి వ్యాధుల బారిన పడవద్దని అందుకు ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు అందించాలని ఇటీవల నియమితులైన జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ రాథోడ్ నరేందర్ ‘ఆరోగ్యజ్యోతి’తో పేర్కొన్నారు. వచ్చే వర్షాకాలంలో ప్రజలు అతిసార, విషజ్వరాలు, డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా లాంటి వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపడతామని తెలిపారు. పంచాయతీ, పంచాయతీ రాజ్, రెవెన్యూ సిబ్బంది సహాయ సహకారం తీసుకుంటూ ప్రజలను వ్యాధుల బారిన పడకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే మా మెడికల్ పారామెడికల్ సిబ్బంది ద్వారా ముందస్తు జాగ్రత్తలు చేపడతామని అయన పేర్కొన్నారు. ప్రతి ఉద్యోగి తమ తమ విధులను సక్రమంగా నిర్వహించాలని,ఉద్యోగులకు సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకు వచ్చినట్లయితే వెంటనే పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.మలేరియా డెంగ్యూ లాంటి వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపినారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మురికి కాల్వలను శుభ్రంలని అన్నారు. రోడ్లపై నీరు నిలువకుండా ఉండే విధంగా చూసుకోవలన్నారు. మాతా శిశు సంరక్షణ ఎంతో కీలకమైందని ప్రతి గర్భిణీ ఆసుపత్రిలో ప్రసవం అయ్యే విధంగా సిబ్బంది చూడాలన్నారు.ఆరోగ్య ఆదిలాబాద్ గా తీర్చి దిద్దడానికి అందరి సహాయ సహకారాలు అవసరమన్నారు.