సూర్యాపేట : కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల ద్వారా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదలకు భరోసా కల్పిస్తోందని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలోని చివ్వేంల, అక్కలదేవిగూడెం గ్రామాల్లో లబ్దిదారులకు మంత్రి కల్యాణలక్ష్మీ చెక్కులను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... కల్యాణలక్ష్మీ పథకం యువతుల పాలిట వరం లాంటిదన్నారు. ఆర్థికంగా వెనుకబడిన ఓసీలకు కూడా ఈ పథకాన్ని వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. పేద ప్రజలకు సామాజిక భద్రత కల్పిస్తోంది దేశంలో ఒక్క తెలంగాణ ప్రభుత్వమేనన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్, జడ్పీటీసీ సంజీవ్ నాయక్, ఎంపీపీ రాణి, ఆర్డీవో మోహన్‌రావ్, ఎమ్మార్వో సైదులు తదితరులు పాల్గొన్నారు.