ఆదిలాబాద్, (ఆరోగ్యజ్యోతి); ఆదిలాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గా డాక్టర్ రాథోడ్ నరేందర్ నియమిస్తున్నట్లు ప్రభుత్వం శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా పనిచేస్తున్న డాక్టర్ తోడాసం చందు పదవి విరమణ పొందారు. ఈయన స్థానంలో డాక్టర్ నరేందర్ ను నియమించారు.ఆదిలాబాద్ జిల్లా కు చెందిన డాక్టర్ నరేందర్ భీంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి గా పని చేయడంతో పాటు, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి లో మత్తుమందు నిపుణులు గా పనిచేశారు. కొంతకాలం జిల్లా మలేరియా అధికారి గా పనిచేశారు.ప్రస్తుతం బోథ్ కమ్యునిటీ హెల్త్ సెంటర్ సుపరిండెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి గా నియమించడం సంతోషకరమన్నారు.