పేదల కోసమే బస్తీ దవాఖానలు : మంత్రి మల్లారెడ్డి

హైదరాబాద్ : పేద ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం బస్తీ దవాఖానలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండతో జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా మరో 45 బస్తీ దవాఖానలను మంత్రులు ప్రారంభిస్తున్నారు. ఎర్రగడ్డ సుల్దాన్ నగర్, యాదగిరి నగర్ లో బస్తీ దవాఖానలను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.మూసాపేట్ సర్కిల్ కేపీహెచ్ బీ కాలనీ 4వ ఫేస్ లో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కూర్మయ్య గారి నవీన్ కుమార్, కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు, మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రజల కోసమే రాష్ట్ర ప్రభుత్వం బస్తీ దావఖానలను ఏర్పాటు చేస్తుందన్నారు. అలాగే మోండా మార్కెట్ డివిజన్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ ప్రారంభించారు. కాగా, కొ్త్తగా హైదరాబాద్ జిల్లాలో 22, మేడ్చల్ జిల్లాలో 15, రంగారెడ్డి జిల్లాలో 3 బస్తీ దవాఖానలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో 124 బస్తీ దవాఖానలు సేవలు అందిస్తున్నాయి.