ఎడ్యుకేషనల్ హాలిడే ప్రకటించిన ప్రైవేట్ మెడికల్ కాలేజీలు

అమరావతి: ఎడ్యుకేషనల్ హాలిడేను ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రకటించాయి. ఏపీ ప్రభుత్వానికి ప్రైవేట్ మెడికల్ కాలేజీ యాజమాన్యాలు లేఖ రాశాయి. ప్రైవేట్ మెడికల్ కళాశాలలో కన్వీనర్ కోటా భర్తీ చేయొద్దని, ఇప్పటికే ప్రభుత్వానికి యాజమాన్యాలు లేఖ  రాశాయి. కోవిడ్-19 చికిత్స కోసం ప్రభుత్వానికి మెడికల్ కాలేజీలు కేటాయించామని యాజమాన్యాలు గుర్తుచేశాయి. ప్రభుత్వం నిర్ణయించిన కొత్త ఫీజులు ప్రకారం కాలేజీలను నడపలేమని, మెడికల్ కాలేజీలు ఆర్థికంగా చితికిపోయాయని, అన్ని కేటగిరీల్లో 70 శాతం ఫీజు కోత విధించారని కాలేజీ యాజమాన్యాల ఆవేదన వ్యక్తం చేశాయి.