కరోనా సోకిన మహిళకు కవల పిల్లలు

ఇండోర్‌: దేశంలో కరోనా మహమ్మారి విస్తరణ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. పిల్లలు, వృధ్దులు, పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిపై కరోనా ప్రభావం చూపుతున్నది. చాలా మంది గర్బిణులు సైతం కరోనా రక్కసి బారినపడుతున్నారు. ఇదే క్రమంలో మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఇండోర్‌కు చెందిన ఓ గర్భిణికి కూడా ఇటీవల కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆమెను ఇండోర్‌లోని MTH ఆస్పత్రిలో ఐసోలేషన్‌కు తరలించారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నఆమె శనివారం మధ్యాహ్నం పండంటి ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. ప్రసవించిన మహిళతోపాటు పిల్లలిద్దరూ క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని ఎంటీహెచ్‌ ఆస్పత్రి ఇన్‌చార్జి డాక్టర్‌ సుమిత్‌ సుక్లా చెప్పారు. నార్మల్‌ డెలివరీ ద్వారానే పిల్లలిద్దరూ జన్మించారని ఆయన తెలిపారు.