హైదరాబాద్: ఏఈవోల నియామకాలను పూర్తిగా మెరిట్ ప్రాతిపదికనే చేపడతామని మంత్రి నిరంజన్‌నరెడ్డి స్పష్టంచేశారు. ఉద్యోగుల ఎంపిక బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించినట్టు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు. నియామకాలలో ఎలాంటి అక్రమాలకు ఆస్కారం లేదని, రాజకీయ జోక్యం ఏమాత్రం ఉండదని స్పష్టంచేశారు.