అమరావతి: ఏపీ కరోనా కేసుల తాజా బులెటిన్‌ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసింది. గత 24 గంటల్లో విదేశాల నుంచి వచ్చిన వారిని కలుపుకుని 85 మంది కోవిడ్ -19 పాజిటివ్‌గా తేలారు. 79 మంది కోవిడ్ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. కరోనా బారిన పడి కర్నూల్ జిల్లాలో ఒకరు చనిపోయారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 2784 కేసులలో 2037మంది డిశ్చార్జ్ కాగా, 60 మంది మరణించారు. ప్రస్తుతం 777 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులలో చిత్తూర్‌లో నలుగురు, నెల్లూరులో ఇద్దరు.. తమిళనాడులోని కోయంబేడు నుంచి వచ్చారని అధికారులు తెలిపారు.