టీఆర్‌ఎస్‌లో చేరిన కార్పొరేటర్లు

నిజామాబాద్(ఆరోగ్యజ్యోతి)‌: సీఎం కేసీఆర్‌ జనరంజక పాలన నచ్చి వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి స్పష్టంచేశారు. బీజేపీకి చెందిన నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ 25వ డివిజన్‌ కార్పొరేటర్‌ సిరిగాదా ధర్మపురి, కాంగ్రెస్‌కు చెందిన 40వ డివిజన్‌ కార్పొరేటర్‌ న్యామతాబాద్‌ శివచరణ్‌.. ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్‌, బిగాల గణేశ్‌గుప్తా ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. మెండోరా మండలం సావెల్‌ గ్రామ ఎంపీటీసీ పుప్పాల రాజు కూడా మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ రైతుల సంక్షేమానికి ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ విధానాన్ని అందరూ పాటించాలని కోరారు.