తెలంగాణలో కొత్తగా 71 కరోనా పాజిటివ్‌ కేసులు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా మళ్లీ తీవ్రరూపం దాల్చింది. మంగళవారం ఒక్కరోజే  71 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో తాజాగా ఒకరు మృతి చెందారు. ఇప్పటివరకూ 1,991 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా 57 మంది మృతి చెందారు. 650 యాక్టీవ్‌ కేసులు ఉన్నాయి. మంగళవారం 120 మంది డిశ్చార్జ్‌ కాగా ఇప్పటి వరకు 1284 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. మంగళవారం జీహెచ్‌ఎంసీ పరిధిలో 38 మందికి, 12 మంది వలస కార్మికులకు కరోనా పాజిటివ్ వచ్చింది. అలాగే విదేశాల నుంచి వచ్చిన నలుగురితో పాటు నేడు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నమోదైన కేసుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 38, రంగారెడ్డి-7, మేడ్చల్‌-6, వలస కూలీలు-12, విదేశాల నుంచి వచ్చినవారు-4, సూర్యాపేట-1, వికారాబాద్‌-1, నల్లగొండ-1, నారాయణపేట-1.. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ అధికారులు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు.