క్వారంటైన్‌ ఛార్జీలు 7 రోజులకే వసూలు చేయాలి

ఢిల్లీ : కోవిడ్‌-19 కారణంగా విదేశాల నుంచి వచ్చే భారతీయులను మొదటగా క్వారంటైన్‌ కేంద్రాలకు తరలిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉండేందుకు వారు ముందే డబ్బులు చెల్లించాలి. కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాల ప్రకారం విదేశాల నుంచి వచ్చిన వారిని 14 రోజులు క్వారంటైన్‌కు తరలించేవారు. ఈ 14 రోజులకు వారు ముందే డబ్బులు చెల్లించేవారు. కాగా క్వారంటైన్‌ మార్గదర్శకాలను కేంద్రం తాజాగా మార్చింది. 14 రోజుల కాల వ్యవధిని 7 రోజులకు తగ్గించింది. తప్పనిసరి క్వారంటైన్‌ 7 రోజులకే ఛార్జీలు వసూలు చేయాలని సూచించింది. దీంతో వారం రోజుల ఖర్చులు మినహా మిగతా వారం రోజుల నగదును తిరిగి వినియోగదారులకు చెల్లించాల్సిందిగా ఆదేశించింది. ఈ మేరకు హోటళ్లు, తదితర క్వారంటైన్‌ కేంద్రాలకు రాష్ర్టాలు మార్గదర్శకాలు జారీ చేయాల్సిందిగా రాష్ర్టాలను ఆదేశించింది.