ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ బాధ్యతలను ఆదివారం నాడు స్వీకరించారు.జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా పనిచేస్తున్న డాక్టర్ చందు పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో డాక్టర్ నరేందర్ ఆదివారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాథోడ్ నరేంద్ర మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు.ప్రజలు రోగాల బారిన పడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. వచ్చే వర్షాకాలంలో ప్రజలు డెంగ్యూ మలేరియా టైప్ డయేరియా లాంటి వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపారు .ఇందుకుగాను రెవెన్యూ పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ ఇలాంటి శాఖ సహాయ సహకారాలు తీసుకొంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలోజిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శ్రీకాంత్, తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్ మెట్పల్లి వార్, డాక్టర్ వై సి శ్రీనివాస్,డాక్టర్ నవ్యసుధ ,డాక్టర్ ఆనంద్ తెలంగాణ vవైద్య ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బండారి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.