హైదరాబాద్ : తెలంగాణలో కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. వారంలో రెండు మూడ్రోజులు కేసులు తగ్గడం మళ్లీ ఒక్కసారిగా భారీగా పెరిగిపోతున్నాయ్. దీంతో ప్రజలు.. మరీ ముఖ్యంగా నగరవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. శుక్రవారం నాడు కొత్తగా 62 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. కొత్త కేసులతో కలిపితే రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1761కి చేరుకుంది. ఇవాళ హైదరాబాద్‌లో 42 కేసులు నమోదవ్వగా.. రంగారెడ్డిలో ఒక్క కేసు నమోదయ్యింది. మరోవైపు వలస కార్మికుల్లో 12 మందికి కరోనా సోకినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.