న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలతో అల్లాడుతున్న జనాలకు భారత వాతావరణ సంస్థ(ఐఎండి) మరో చేదువార్త చెప్పింది. ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నట్లు ఐఎండి శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ కుమార్ వెల్లడించారు. ఏపీలోని కోస్తా ప్రాంతం, తెలంగాణ, పంజాబ్, హర్యానా, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎండ వేడిమి మరింత పెరగనున్నట్లు ఆయన తెలిపారు. మరో ఐదు రోజుల పాటు సూర్య ప్రతాపం తప్పదని.. 47 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. అసలే కరోనాతో అల్లాడుతున్న ప్రజలను భానుడు మరింత భయపెడుతుండటం గమనార్హం.