రంజాన్‌ సందర్భంగా పేదముస్లింలకు నిత్యావసరాల పంపిణీ

ఖమ్మం: రంజాన్‌ పర్వదినాన్నిపురస్కరించుకుని పువ్వాడ ఫౌండేషన్‌ ఆద్వర్యంలో ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలో దాదాపు ఐదువేల మందికి నిత్యావసరాల కిట్‌లను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌పంపిణీ చేశారు. మంత్రి సతీమణి పువ్వాడ వసంతలక్ష్మితో కలిసి మంత్రి వీటిని పంపిణీ చేవారు. రంజాన్‌ సందర్భంగా పేద ముస్లింలకు తోఫా రూపంలో వీటిని అందజేశారు. లాక్‌డౌన్‌ నేపధ్యంలో కొన్నిరోజులుగా మంత్రి పువ్వాడ పేదలకు పెద్దయెత్తున నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నారు. రంజాన్‌ పండగను పేద ముస్లింలు కూడా ఆనందంగా జరుపుకోవాలన్న లక్ష్యంతోనే వారికి నిత్యావసరాల కిట్‌లను అందించినట్టు తెలిపపారు. ఒక్కోకిట్‌లో డ్రైఫ్రూట్స్‌తో సహా పది రకాల నిత్యావసర వస్తువునలు అందించినట్టు తెలిపారు. ముస్లిం సోదరులు పర్వదినంగా భావించే రంజాన్‌ మాసంలో మానవీయ కోణంలో నిత్యావసరాలను అందేయడం అభినందనీయమని ముస్లిం పెద్దలు కొనియాడారు.