ఆసిఫాబాద్‌ జిల్లాలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు

ఆసిఫాబాద్‌ : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండలు భగభగ మండుతుండటంతో.. ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఉదయం 6 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరుగుతున్నాయి. మే నెల ప్రారంభంలో 42,43 డిగ్రీల వరకు ఉన్న ఉష్ణోగ్రతలు ఒక్క సారిగా 45,46,47 డిగ్రీలు నమోదవడం ఆందోళన కలిగిస్తుంది. శనివారం 47 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో ఉక్కపోతకు ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇండ్ల నుంచి బయటకు రాకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.