పానీపూరీతో 40 మంది పిల్లలకు అస్వస్థత

ఆదిలాబాద్(ఆరోగ్యజ్యోతి):  ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ని సందరయ్య నగర్, ఖుర్షిద్ నగర్ లో ఓ గప్ చుప్ ల బండి వద్ద పానీపూరీ తిన్న దాదాపు 40 మంది చిన్నారులు దవాఖాన పాలయ్యారు. నలుగురు పిల్లల పరిస్థితి సీరియస్ గా ఉంది. సోమవారం సాయంత్రం ఓ బండి వద్ద పానీపూరీ తిన్న వారందరికి వెంటనే వాంతులు విరేచనాలు మొదలయ్యాయి. దీంతో అందరినీ ట్రీట్ మెంట్ కోసం రిమ్స్ దవాఖానకు తరలించారు. విషయం తెలుసుకున్న డీఎం అండ్ హెచ్ఓ చందూ రిమ్స్ హాస్పిటల్ కు చేరుకుని పరిస్థితిని తెలుసుకున్నారు. చిన్నారుల కండిషన్ ను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు.