అహ్మదాబాద్: గుజరాత్ లో కరోనాపాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది. ఇవాళ కొత్తగా 394 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. 29 మంది మృతి చెందినట్లు తెలిపారు. మృతుల్లో 21 మంది ఇతర సమస్యలతో బాధపడుతున్నారని పేర్కొన్నారు.ఇవాళ్టి కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 14,063కు చేరుకున్నట్లు తెలిపారు. వీటిలో 6793 యాక్టివ్ కేసులుండగా, 67 మంది వెంటిలేటర్‌పై చికిత్సపొందుతున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 6412గా ఉందని వెల్లడించారు.