తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 38 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 1699కి చేరినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గురువారం సాయంత్రం 8 గంటలకు కరోనాపై బులిటెన్ విడుదల చేసింది. ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో 26, రంగారెడ్డి జిల్లాలో 2 కరోనా కేసులు నమోదైనట్లు తెలిపింది. అలాగే కొత్తగా 10 వలస కార్మికులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు చెప్పింది. ఇవాళ 23 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, ఇప్పటి వరకు మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1036కు చేరినట్లు తెలిపింది. గురువారం ఒక్క రోజే ఐదుగురు కరోనాతో మరణించగా.. మొత్తంగా ఇప్పటి వరకు 45 మంది కరోనా మహమ్మారికి బలయ్యారని వెల్లడించింది. ప్రస్తుతం 618 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారని చెప్పింది.