న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను కేంద్రం మరోసారి పొడిగించింది. కంటైన్మెంట్ జోన్లలో జూన్ 30 వరకు లాక్‌డౌన్‌ను కొనసాగించింది. ఈ సందర్భంగా మరిన్ని సడలింపులతో లాక్‌డౌన్ 5.0 మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. జూన్ 8 నుంచి సడలింపులు అమల్లోకి రానున్నాయి. కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్‌డౌన్ పరిమితం చేసింది. దేశవ్యాప్తంగా జూన్ 8 నుంచి ఆలయాలు తెరుచుకోనున్నాయి. రాష్ట్రాలను సంప్రదించిన తర్వాత స్కూల్స్, కాలేజీలకు అనుమతి ఉంటుంది. బహిరంగ, పనిప్రదేశాల్లో మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరి చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేస్తే జరిమానా విధించే అధికారం రాష్ట్రాలకే ఇచ్చింది.
అనుమతి లేనివి..!
సినిమా హాళ్లు, జిమ్‌లు, మెట్రోరైళ్లు, అంతర్జాతీయ విమాన సర్వీసులకు అనుమతి లేదు.
పార్కులు, బార్లు, ఆడిటోరియంలు, క్లబ్బులకు కూడా అనుమతి లేదు.
రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, మతపరమైన కార్యకలాపాలపై త్వరలో నిర్ణయం
అంతర్జాతీయ విమాన సర్వీసులు, మెట్రో రైళ్లు, సినిమాహాల్స్, జిమ్‌లు, బార్లు, స్విమ్మింగ్ పూల్స్, పార్కులు, ఆడిటోరియంల ప్రారంభంపై ప్రస్తుతానికి అనుమతి లేదు.
జూన్ 8 నుంచి అనుమతిచ్చినవి ఇవే..!
హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్‌కు గ్రీన్‌సిగ్నల్
జూన్ 8 నుంచి ప్రార్థనా మందిరాలకు అనుమతి
రాష్ట్రాల మధ్య ప్రజలు, సరుకుల రాకపోకలకు గ్రీన్ సిగ్నల్
జులైలో స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు ప్రారంభం