ఢిల్లీ,(ఆరోగ్యజ్యోతి): దేశంలో కరోనా వైరస్ కేసులు సంఖ్య పంజా విసురుతోంది. రోజు రోజుకూ కొత్త పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వరుసగా రెండవ రోజు కూడా పాజిటివ్ కేసులు ఏడు వేలు దాటాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 7964 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక మరణించిన వారి సంఖ్య కూడా అత్యధికంగా ఉన్నది. గత 24 గంటల్లో దేశంలో కరోనా వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 265గా నమోదు అయిట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఒకే రోజు అత్యధిక స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే అత్యధికం. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,73,763గా ఉన్నది. సుమారు 80 వేల మంది వైరస్ నుంచి కోలుకున్నారు.