బెంగళూరు: 130 కొత్త కేసులతో కర్ణాటక రాష్ట్రం 2000 కరోనా కేసుల మార్కును దాటింది. కొత్త కేసుతో కర్ణాటకలో మొత్తం కేసుల సంఖ్య 2089 కు చేరింది. కొత్తగా కరోనా నుండి కోలుకున్న 46 మందితో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 654 కు చేరింది. ఇక కర్ణాటక రాష్ట్రంలో ప్రస్తుతం 1391 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాలు 42 కాగా నేడు ఒక్కరు కూడా మరణించలేదు. డిశ్చార్జ్ అయిన వారిలో 20 మంది ఉత్తక కర్ణాటక జిల్లాలో కాగా 18 మంది దేవన్‌గెరెలో, నలుగురు చిత్రదుర్గంలో, బాగల్‌కోట్‌లో ముగ్గురు, హవేరీలో ఒక్కరు ఉన్నారు. కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో ఎక్కువగా మహిళలు, చిన్నారులే ఉన్నారు. కొత్త కేసుల్లో 57 మంది మహిళలు కాగా 28 మంది చిన్నారులు ఉన్నారు.