హైదరాబాద్: లాక్‌డౌన్‌లో కొన్ని సడలింపుల నేపథ్యంలో పరీక్ష నిర్వహణకు జేఎన్టీయూహెచ్ సిద్ధమైంది. కరోనాతో నిలిచిన డిగ్రీ, బీటెక్ పరీక్షలను జూన్, జూలైలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నది. జూన్ 20 నుంచి 30వ తేదీవరకు బీటెక్ ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించడానికి షెడ్యూల్ ఇవ్వనున్నది. జూలై 16 నుంచి బీటెక్ ఫస్టియర్, సెకండియర్, థర్డ్‌ఇయర్ పరీక్షలు కూడా నిర్వహించాలని నిర్ణయించారు. లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూనే సెమిస్టర్ పరీక్షలు నిర్వహించడానికి చర్యలు చేపట్టినట్టు ఆ వర్సిటీ ఇంచార్జి రిజిస్ట్ట్రార్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. రాష్ట్రంలో ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలకు అఫిలియేషన్ ప్రక్రియలో భౌతిక తనిఖీలు రద్దు చేసే ఆలోచనతో వర్సిటీ ఉన్నది. తనిఖీలు లేకుండా ఆన్‌లైన్ ద్వారా స్వీకరించిన దరఖాస్తులు, కాలేజీ యాజమాన్యాలు ఇచ్చే అఫిడవిట్లతో 2020-21 విద్యా సంవత్సరానికి అఫిలియేషన్ల మంజూరుపై మూడురోజుల్లో తుది నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం.