జైపూర్: రాజస్థాన్‌లో కొత్తగా 150కిపైగా కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఓ నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం గత 24 గంటల్లో కొత్తగా 152 కరోనా కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యాయి. ఒకరు మరణించారు. 77 మంది కరోనా నుంచి కోలుకోగా వారిలో 72 మందిని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు. కొత్తగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 6,377కు చేరింది. 152 మంది మరణించారు. ఇప్పటివరకు 3,562 మంది కరోనా నుంచి కోలుకోగా 2,663 మంది ఇప్పటికీ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూనే ఉన్నారు.