హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా యాచారంలో, వనపర్తి జిల్లాలోని పెబ్బేరు మండలంలో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం సూగూరుకు చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో అతన్ని గాంధీ దవాఖానకు తరలించారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా హాస్పిటల్‌లో డైటీషియన్‌గా పనిచేస్తున్న ఆయన శుక్రవారం పెబ్బేరు వచ్చివెళ్లాడు. దీంతో అతనికి సంబంధించిన మూడు కుటుంబాల్లోని 11 మందిని హోం క్వారైంట్‌ను పంపించారు.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని చౌదర్‌పల్లిలో 13 నెలల చిన్నారికి కరోనా వైరస్‌సోకింది. దీంతో ఆ చిన్నారికి హైదరాబాద్ తరలించారు. చిన్నారి తండ్రి ఇబ్రహింపట్నం పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.