ఇంట్లో 123 పాములు

మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్ లోని భింద్ జిల్లాలో పాముల సంచారం కలకలం రేకెత్తిస్తోంది. రోన్ గ్రామంలోని జీవన్ సింగ్ కుష్వాఅనే వ్యక్తి ఇంట్లో..వారం వ్యవధిలో 123 పాములను గుర్తించారు. తన ఇళ్లు పాములకు ఆవాసంగా మారడంతో చేసేదేమి లేక జీవన్ సింగ్ కుష్వా తన కుంటుంబంతో కలిసి వేరే ఊరికి వెళ్లిపోయాడు. రోజూ ఇంట్లోకి  కోబ్రాలు వచ్చి చేరుతుండటంతో..కొంతమంది గ్రామస్థులు దీన్ని శకునంగా భావిస్తున్నారు.అయితే జీవన్ సింగ్ కుష్వా తన ఇంటిని కాపాడుకోవడానికి గార్డులా కాపాలాగా ఉంటున్నాడు. కొన్ని రోజులుగా పాములు కనిపిస్తుండటంతో జీవన్ సింగ్ ఇంటిని స్నేక్ హౌస్ గా పేర్కొంటున్నారు. మరోవైపు పాములతో జనాలు భయాందోళనకు లోనవుతున్నారు. పాములతో ఫారెస్ట్ ఆఫీసర్లు ఎవరికి ఎలాంటి హానిజరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.