గురుకులాల భవనాలకు శానిటైజేషన్‌

హైదరాబాద్‌: గురుకుల విద్యాసంస్థలను శాని టైజ్‌ చేయాలని సొసైటీలు భావిస్తున్నాయి. ప్రస్తుతం లాక్‌డౌన్‌ సడలింపులతో మెజార్టీ రంగాలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈక్రమంలో అతి త్వరలో విద్యా సంస్థల నిర్వహణకు సైతం ప్రభుత్వం వెసులుబాటు ఇవ్వనున్న నేపథ్యంలో ఆ దిశగా సొసైటీ యాజమాన్యాలు చర్యలు మొదలు పెట్టాయి. ఇందులో భాగంగా గురుకుల పాఠశాలలను క్రమ పద్ధతిలో శానిటైజేషన్‌ చేయనున్నాయి. కోవిడ్‌–19 అనుమానితుల కోసం చాలా గురుకుల పాఠశాలల భవనాలను క్వారంటైన్‌ సెం టర్లుగా ప్రభుత్వం వినియోగించింది. ఆ భవనాలను శానిటైజేషన్‌ చేయనున్నారు. వచ్చే వారం నుంచి ఈ ప్రక్రియ మొదలు పె ట్టనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం సూచించడం తో అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. త్వరలో క్షేత్రస్థాయిలో చర్యలు ప్రారంభిస్తారు.