గౌతమ్ బుద్ధ నగర్ లో పెరిగిన కరోనా కేసులు

లక్నో: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని గౌతమ్ బుద్ధ నగర్ లో శుక్రవారం కొత్తగా మరో 5 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు అవగా, కరోనా నుంచి కోలుకొని ఐదుగురు డిశ్చార్జ్ అయినట్లు వైద్య శాఖ తెలిపింది. ప్రస్తుతం 88 మంది కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 307 కరోనా కేసులు నమోదైనట్లు ఉన్నతాధికారులు తెలిపారు.