కోల్ కతా: కరోనా కట్టడికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. అయినప్పటికీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే మరో కఠిన నిర్ణయం తీసుకుంది అక్కడి ప్రభుత్వం. మరోసారి లాక్‌డౌన్ పొడగించాలని నిర్ణయించింది. మే చివరి వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇందుకు కొన్నికొన్ని సడలింపులు ఇవ్వనున్నట్లు పేర్కొంది. చిన్న దుకాణాలు, ఎంపిక చేసిన గ్రీన్ జోన్లలో వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించడానికి అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.