రాంనగర్ యువత అద్వర్యంలో అన్నదానం

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): ఆదిలాబాద్ పట్టణంలోని 11వ వార్డ్ రామ్ నగర్ కాలనీ వాసులు ఆధ్వర్యంలో 300 మంది పులిహోర ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు మంచినీటి ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జాడీ రాజారెడ్డి మాట్లాడుతూ ఆదిలాబాద్ ఆనుకొని ఉన్న బైపాస్ 44వ జాతీయ రహదారిపై వివిధ స్టేట్ లకు వెళ్తున్న వారికి అన్నదానం చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. 300 మందికి పులిహోర ప్యాకెట్లు పంచడంతోపాటు కొంతమంది పాదచారుల ను వాహనాలు ఆపి వారి గ్రామాలకు వెళ్లే విధంగా లారీల లో ఉంచడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్క యువత కూడా ఈ ఆపద కాలంలో ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.సేవా కార్యక్రమాల్లో యువతతో పాటు కాలనీవాసులు ముందుండాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. కాలనీకి చెందిన రాజు నిఖిల్ రాజేష్ సాయి రోహిత్ రాజేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ముందు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటామని వారు తెలిపారు.