అధైర్య పడకండి..అన్నదాతలకు అండగా ఉంటాం...మంత్రి కొప్పుల ఈశ్వర్.

జగిత్యాల,(ఆరోగ్యజ్యోతి) : ధర్మపురి నియోజకవర్గంలో గాలి వానకు నష్టపోయిన మామిడి పంటలను క్షేత్ర స్థాయిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించరు. మంగళవారం కురిసిన గాలి వానకు గొల్లపల్లి మండలంలో మామిడి పంటలు దెబ్బతిన్నాయి.ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ నష్టపోయిన శ్రీరాములపల్లి, మల్యాల మండలం మ్యాడంపల్లి గ్రామాల్లో మామిడి తోటలను  క్షేత్ర స్థాయిలో సందర్శించి రైతులను పరామర్శించారు.ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యం కారణంగా అకాల వర్షాలు , వడగండ్ల వాన పడటంతో  మామిడి తోట తీవ్రంగా దెబ్బతిని తీవ్ర నష్టం జరగడం బాధాకరమని అన్నారు.అకాల వర్షాలకు మామిడి తోటపై నివేదిక తయారూ చేయాలని వ్యవసాయ,ఉద్యానవన శాఖ,రెవెన్యూ  అధికారులను ఆదేశించారు.అధైర్య పడకండని అండగా ఉంటామాని రైతులకు  భరోసానిచ్చారు.రైతులను ఓదార్చి మనోధైర్యాన్ని నింపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రవి, గొల్లపల్లి మండలం ఎంపిపి నక్క శంకర్ , జెడ్పిటిసి గొస్కుల జలేంధర్, పార్టీ అధ్యక్షులు బొల్లం రమేష్,ఆయా గ్రామాల సర్పంచులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు