ఢిల్లీలో కోవిడ్-19 పరీక్షలు చేసిన 529 మంది జర్నలిస్టుల్లో కేవలం ముగ్గురికి మాత్రమే పాజిటివ్ వచ్చిందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. వైరస్ సోకిన జర్నలిస్టులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మీడియాకు ఎంతో ప్రాధాన్యం ఉందని పేర్కొన్నారు. ఢిల్లీలో గతవారం కొందరు మీడియా ప్రతినిధులకు కరోనా లక్షణాలు కనిపించటంతో వారితో కలిసిన వందలమందికి పరీక్షలు నిర్వహించారు.