చిలకలూరిపేటలోనూ.. లాక్‌డౌన్‌

చిలకలూరిపేట: నరసరావుపేటలో రోజురోజుకీ కరోనా కేసుల ఉధృతి పెరుగుతుండటంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు డివిజన్‌ మొత్తం రెండు రోజులపాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ నేపథ్యంలో చిలకలూరిపేట ప్రాంతంలో బుధవారం లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలు చేశారు. అన్ని మార్గాలలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. అర్బన్‌, రూరల్‌ సీఐలు  సూర్యనారాయణ, ఎం సుబ్బారావుల ఆధ్వర్యంలో ఎస్‌ఐలు రాంబాబు, అసన్‌, నారాయణరెడ్డి, నాగేశ్వరరావులు బందోబస్తు పర్యవేక్షించారు