వడ్లు కొనుగోలు పై అత్యవసర సమావేశం


రాజన్న సిరిసిల్ల, (ఆరోగ్యజ్యోతి): సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సివిల్ సఫ్లయ్ డియం  ఇర్పాన్ తో ఆధ్వర్యంలో వడ్లు కొనుగోలు చేయాలని సిరిసిల్ల మార్కెట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ సిద్ధం వేణు గోపాల్ ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ అధికారులు రైస్ మిల్ ఓనర్ తో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి సిరిసిల్ల జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ తో పాటు పి ఏ సి ఎస్ చైర్మన్లు తిరుపతి రెడ్డి అన్నాడి అనంత్ రెడ్డి ఇ వల్లంపట్ల సర్పంచ్ కేతిరెడ్డి  అనసూర్య వెంకట  మండల ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు దూలం శ్రీనివాస్త దితరులు పాల్గొన్నారు. మానకొండూరు శాసనసభ్యులు రసమయి బాల కిషన్ సూచనల మేరకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇల్లంతకుంట మండలం లో రోజుకు వెయ్యి  మెట్రిక్  టన్నుల వడ్లను తీసుకోవాలని మండలంలోని ప్రతి సెంటర్ కు రెండు లారీలు పంపించాలని ఓనర్స్ రైతులు ఇబ్బంది పెట్టకుండా చూడాలని ఈ సమావేశంలో రైస్ మిల్ ఓనర్ లకు సూచించారు.