సామాజిక దూరం తోనే వ్యాధి దరిచేరదు


పేదలకు నిత్యావసరాల పంపింని 
ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య
జనగామ, (ఆరోగ్యజ్యోతి): సామాజిక దూరం. ఇంటి నుంచి బయటకు రాకపోవడం వల్ల కరోనా వైరస్ దరిచేరదని స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. బుధవారం నాడు రాజన్న యువసేన మరియు సావిత్రిబాయి పూలే ఉమెన్స్  విన్నింగ్   అసోసియేషన్ ఆధ్వర్యంలో పేదలకు బియ్యం నిత్యావసర వస్తువులు కూరగాయల పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ వైరస్ ప్రపంచాన్ని గజాగజా లభిస్తుందన్నారు. లాక్‌డౌన్‌ ప్రకటించిన వల్ల పేద ప్రజలకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.సామాజిక దూరం పాటించాలని అవసరమైతే మాత్రం బయటకు వెళ్లాలని లేనిపక్షంలో ఎవరు కూడా బయటకు వెళ్లలేదని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రాజన్న యువసేన ఆధ్వర్యంలో ఇప్పటి వరకు పేదలకు పలు రకాల కార్యక్రమాలు చేయడం జరిగిందని  ఆయన తెలిపారు. ఈ సమయంలో పేదలకు సేవలు అందించడంలో ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సావిత్ర బాయి పూలే ఉమెన్  విన్నింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు పూడిచేరి సంధ్య నవీన్, రాజన్న యువసేన అధ్యక్షులు బండి రాకేష్ గౌడ్, రంగు రవి,  తదితరులు పాల్గొన్నారు.