వలస కార్మికులకు గోధుమ పిండి పంపిణీ

 


వరదయ్యపాలెం,(ఆరోగ్యజ్యోతి):  కరోనా కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ విదంచడంతో ఉపాధి లేక అలాడుతున్న  130 మంది వలస కార్మికులకు వరదయ్యపాలెం  బి ఇ పి సి ఫౌండేషన్  ఆధ్వర్యంలో గురువారంనాడు 150 కెజీ గోధుమ పిండి అందించడం జరిగింది. ఈ సందర్భంగా రియాజ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమనికి సహకారం అందించిన రామస్వామి కి ప్రత్యేక ధన్యవాదాలను తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి యూసఫ్ ఖాన్, సంస్థ సభ్యులు రియాజ్, ఛాన్ బాషా, హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.